ఉయ్యాలవాడ మండలం ఇంజేడులో గంగమ్మ తిరునాళ్లు చివరి రోజైన ఆదివారం గంగమ్మ తల్లికి బోనాలు సమర్పించారు. మేళతాళాలతో మహిళలు బోనాలు తలపై పెట్టుకుని ఆలయానికి చేరుకొని అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్సై వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.