ఆళ్లగడ్డలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన పుట్టాలమ్మ లో ఆదివారం కార్తిక మాస చివరి రోజు కావడంతో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి తెల్లవారుజాము నుండి భక్తులు విశేష పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ ఈవో సాయి జయచంద్ర రెడ్డి భక్తులకు అన్ని సదుపాయాలు కల్పించారు. ప్రధాన అర్చకులు సుబ్బరాయ శర్మ మాట్లాడుతూ కార్తిక మాస బహుళ అమావాస్య కావడంతో సంతాన ప్రదాత అయిన ఆ సుబ్రమణ్య స్వామి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని తెలిపారు.