విజయవాడ వరద బాధితులకు రూ.5లక్షల సాయాన్ని ప్రకటించిన ఎమ్మెల్యే అఖిల ప్రియ

80చూసినవారు
విజయవాడ వరద బాధితులకు రూ.5లక్షల సాయాన్ని ప్రకటించిన ఎమ్మెల్యే అఖిల ప్రియ
విజయవాడలో సంభవించిన వరదల నేపథ్యంలో బాధితుల కోసం భూమా శోభ నాగిరెడ్డి ట్రస్ట్ తరఫున ఐదు లక్షల రూపాయలను సాయాన్ని అందజేయనున్నట్లు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిల ప్రియ పేర్కొన్నారు. ఈ సందర్భంగా బుధవారం స్థానిక ఆ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. సీఎం చంద్రబాబు స్వయంగా బాధితులను పరామర్శించి అండగా నిలుస్తున్నారని అన్నారు. విజయవాడ వరద బాధితులకు ప్రతి ఒక్కరు అండగా నిలవాలని అన్నారు.

సంబంధిత పోస్ట్