సిరివెళ్ల మండలం రాజనగరం గ్రామంలో తానా అధ్యక్షుడు శృంగవరపు నిరంజన్ ఆధ్వర్యంలో బసవతారకం హాస్పిటల్ బృందంతో మెగా మెడికల్ క్యాంప్ లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ప్రారంభించారు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ మాట్లాడుతూ ఈ క్యాన్సర్ మెడికల్ క్యాంపు ఈ ఏరియాలో మొట్టమొదటిసారిగా పెట్టడం జరిగిందనీ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజల కోసం ఏర్పాటు చేశామన్నారు.