గోస్పాడు మండలంలో మిర్చి రైతులు వేసిన పంటను టిడిపి రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ పరిశీలించి రైతుల అడిగి సమస్యలు ఆదివారం తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎన్ఎండి ఫయాజ్ మాట్లాడుతూ.. మిర్చి రైతులకు గిట్టుబాటు ధర కల్పించే విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకొని వెళ్తామని అలాగే రైతులను ఆదుకుంటామని వారికి ఏ సమస్య వచ్చిన తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.