రుద్రవరం మండలం పెద్దకంబలూరు గ్రామ సచివాలయాన్ని మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) భాగ్యలక్ష్మి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె సచివాలయ సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేసి మన మిత్ర క్యాంపెయిన్ సర్వే పురోగతిని, క్షేత్రస్థాయిలో అమలు తీరును ఆమె అడిగి తెలుసుకున్నారు. హౌస్ హోల్డ్ జియో ట్యాగింగ్ సర్వే స్థితిని, దాని ప్రాముఖ్యతను వివరించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నారు.