ఆళ్లగడ్డ పట్టణంలోని రోటరీ క్లబ్ లో రోటరీ ఇన్నర్ వీల్ క్లబ్ డే సందర్భంగా గురువారం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఇన్నర్ వీల్ సభ్యులకు ఆటల పోటీలను నిర్వహించి విజేతలైన సభ్యులకు బహుమతులను అందజేశారు. పేద మహిళలకు దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గాయత్రి, శ్రీదేవి, కవితా సుజాత ఉమా విజయ అనురాధ, సరోజ తదితరులు పాల్గొన్నారు.