రుద్రవరం మండలం చిలకలూరులో శనివారం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ గతంలో చిలకలూరులో ప్రచారానికి వచ్చినప్పుడు వైసీపీ నాయకులకు భయపడి ప్రజలు బయటకు రాలేదన్నారు. ఈ రోజు ప్రజలు స్వచ్ఛందంగా మా వెంట తిరుగుతూ ఉంటే ఎంతో ఆనందంగా ఉంది అన్నారు.