రుద్రవరం పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడిన చిన్న కంబలూరు గ్రామానికి చెందిన బత్తలూరు సంజీవరాయుడును మంగళవారం ఆళ్లగడ్డ జె ఎఫ్ సి ఎం కోర్టులో హాజరు పరచగా మెజిస్ట్రేట్ రిమాండ్ కు ఆదేశించినట్లు ఎస్సై వరప్రసాద్ తెలిపారు. అలాగే 2000 రూపాయలు జరిమానా కూడా విధించినట్లు తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.