అరకొర విద్యుత్తు వినియోగదారులతో సమావేశం రుద్రవరం మండల పరిధిలోని ప్రజలందరూ ప్రధానమంత్రి సూర్య ఘర్ సౌర విద్యుత్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని నంద్యాల జిల్లా విద్యుత్ శాఖ డి ఈ శ్రీనివాసరెడ్డి సోమవారం పేర్కొన్నారు. రుద్రవరం మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం ఇంచార్జి ఏఈ రాజశేఖర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.