ఆళ్లగడ్డ రూరల్ సీ. ఐ. గా గురువారం పదవి బాధ్యతలు చేపట్టిన దాది మురళీధర్ రెడ్డి ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియను ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ కూడా సీఐ మురళీధర్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలిపి రూరల్ సర్కిల్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు చక్కని కృషి చేయాలని సూచించారు. ఎలాంటి లా అండ్ ఆర్డర్ సమస్యలు లేకుండా చేయాలన్నారు.