చాగలమర్రి మండల కేంద్రమైన చాగలమర్రి లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం వివిధ పాఠశాలల నిర్వహణ కమిటీ ఎస్ ఎం సి చైర్మన్ ల శిక్షణా కార్యక్రమం జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మండల విద్యాశాఖ అధికారి న్యామతుల్లా హాజరయ్యారు. పాఠశాల నిర్వహణ, విద్యార్థుల సాధన ప్రమాణాలు, కమిటీ బాధ్యతలు మెరుగైన వసతుల కల్పన వంటి అంశాలపై చర్చించి అవగాహన కల్పించారు.