శిరివెళ్ళ స్థానిక మండల పరిధిలోని గోవిందపల్లె గ్రామంలో నిర్వహిస్తున్న వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి కె. సుదర్శన్ బాబు ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లలకు టీకా వేయడం ద్వారా వ్యాధులను సమర్ధవంతంగా నివారించవచ్చని తెలిపారు. టీకాలు శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచి వ్యాధుల బారిన పడకుండా కాపాడుతాయని అన్నారు.