అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై ప్రత్యేక నిఘా: ఎస్ఐ

62చూసినవారు
ఆళ్లగడ్డ మున్సిపాలిటీ పరిధిలో గల టిడ్కో గృహ సముదాయాలను ఆళ్లగడ్డ పట్టణ ఎస్ఐ వెంకటరెడ్డి శనివారం రాత్రి పరిశీలించారు. అక్కడి ప్రజలకు ఓటు ఆవశ్యకతను వివరించి, అసాంఘిక కార్యకలాపాలపై అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ. జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి ఆదేశాల మేరకు ఆళ్లగడ్డ డీఎస్పీ షేక్ షర్ఫుద్దీన్ పర్యవేక్షణలో పట్టణ సీఐ రమేష్ బాబు సూచనల మేరకు ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్