చాగలమర్రిలో చికెన్ వ్యాపారాలను అడ్డుకుంటున్నారంటూ ఆళ్లగడ్డ రమీజా అనే మహిళపై గురువారం వ్యాపారులు జిల్లా ఎస్పీ ఆదిరాజ్ సింగ్‌రాణాకు ఫిర్యాదు చేశారు. 15 ఏళ్లుగా చికెన్ వ్యాపారం చేస్తూ వస్తున్న తమను రమీజా బెదిరిస్తూ తమ వద్దనే కోళ్లు కొనాలని, వేరే చోట కొంటే షాపులు మూయిస్తానని హెచ్చరిస్తోందని వారు ఆరోపించారు. ఆళ్లగడ్డ ఏఎన్ఆర్ చికెన్ సెంటర్ గతి మీకూ వస్తుందని బెదిరింపులు ఎదురవుతున్నాయన్నారు. న్యాయం చేయాలని కోరారు.