నంద్యాల జిల్లా ఎస్పీ అది రాజ్ సింగ్ ఉత్తర్వుల మేరకు ఆళ్లగడ్డ పట్టణ సిఐ చిరంజీవి, ఎస్సై నగీన, జయప్పలు పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో ఇరువురిపై కేసు నమోదు చేశారు. బండి చంద్రశేఖర్, గైబు వలి చింతకుంట గ్రామం అను వ్యక్తులను ఆళ్లగడ్డ మెజిస్ట్రేట్ ఈశ్వర వరప్రసాద్ ముందు గురువారం హాజరు పరచగా ఒక్కొక్క రెస్పాండెంట్ కు 10 వేల రూపాయలు జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు.