జనసేనలో చేరిన వైసీపీ కౌన్సిలర్

51చూసినవారు
జనసేనలో చేరిన వైసీపీ కౌన్సిలర్
ఆళ్లగడ్డ పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయం నందు తాలూకా ఇంచార్జ్ ఇరిగెల రాంపుల్లారెడ్డి సోదరుల సమక్షంలో శనివారం యంవి నగర్ 24వ వార్డ్ కౌన్సిలర్ గురు మూర్తి వారి అనుచర వర్గం దాదాపు 25 కుటుంబాలు జనసేన పార్టీలో చేరడం జరిగింది. వీరికి ఇరిగెల రాంపుల్లారెడ్డి పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం వారు మాట్లాడుతూ త్వరలోనే మున్సిపల్ చైర్మన్ పదవి కూటమి వశం కాబోతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాయలసీమ జోన్ కమిటీ సభ్యులు మా బూబ్ హుస్సేన్ ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్