ఆలూరు: హోళగుందలో ఆరు గడ్డివాములు దగ్ధం

65చూసినవారు
హొళగుంద మండలం ముద్దటమాగి, హోళగుంద గ్రామాల్లో గురువారం జరిగిన అగ్ని ప్రమాదంలో ఆరు గడ్డివాములు దగ్ధమయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రైతులకు రూ. 4. 50 లక్షల నష్టం వాటిల్లిందని, ముద్దటమాగి గ్రామ శివారులో కురువ ఈరన్న వేసిన వాములకు మంటలు అంటుకొని దగ్ధమయ్యాయి. హొళగుందలో చెరువు గట్టులో కూడ్లూరు రఫీక్, ముల్లా అబ్దుల్లా వేసుకున్న గడ్డివాములు కూడా మంటల్లో కాలిపోయాయి.

సంబంధిత పోస్ట్