దేవనకొండ మండలం కదిరికొండ పంచాయతీ సెక్రటరీ అయిన మహిళపై ఈవోఆర్డీ సూర్యనారాయణ మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నాడని, చర్యలు తీసుకోవాలని ఆయన భర్త ఫిర్యాదు చేశారు. మంగళవారం ఈవోఆర్డీ సూర్యనారాయణ పై చర్యలు తీసుకోవాలని ఎరుకుల హక్కుల పోరాట సమితి ప్రధాన కార్యదర్శి ఎరుకలి రాజు, జనసేన నాయకులు కరుణాకర్ డీపీవో కార్యాలయంలో జిల్లా పంచాయతీ అధికారి భాస్కర్ కు వినతిపత్రం అందజేసి, ఫిర్యాదు చేశారు.