ఆస్పరి పట్టణంలోని మోడల్ స్కూల్లో బుధవారం గుర్తుతెలియని దుండగులు చోరీకి ప్రయత్నించారు. వాచ్మన్ ఆంజనేయ 5 గంటల వరకు విధుల్లో ఉండగా, కాలకృత్యాలు తీర్చేందుకు వెళ్లిన సమయంలో దుండగులు ఓగది తలుపు గడియను ధ్వంసం చేశారు. వాచ్మెన్ ఆ గడియను చూసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అయితే, ఎటువంటి సామాగ్రి చోరీ చేయలేదు. సీసీ కెమెరాలు త్వరలో ఏర్పాటు చేస్తామని ప్రిన్సిపాల్ సమీల తెలిపారు.