ఆలూరు: బీసీ కార్పొరేషన్ రుణాలు సద్వినియోగం చేసుకోవాలి

72చూసినవారు
ఆలూరు: బీసీ కార్పొరేషన్ రుణాలు సద్వినియోగం చేసుకోవాలి
బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలు పొందడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు చిప్పగిరి ఎంపీడీవో అల్లాబకాష్ బుధవారం తెలిపారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆయా గ్రామాల సచివాలయాల్లో సంప్రదించాలని పేర్కొన్నారు. దరఖాస్తుకు ఓబీఎంఎంఎస్ సైట్ ప్రారంభమైందని, వెనుకబడిన వర్గాల వారికి ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్