హోళగుంద మండలంలోని హెబ్బటంలో శుక్రవారం చోటు చేసుకున్న గడ్డివాముల దగ్ధంపై ఆలూరు సీఐ వెంకట చలపతి హొళగుంద ఎస్సై బాల నరసింహులతో కలిసి శనివారం విచారణ చేపట్టారు. ఈ ఘటన ప్రమాదవశాత్తు చోటు చేసుకుందా లేదా ఎవరైన నిప్పు పెట్టారా అనే కోణంలో స్థానికులను విచారించారు. ఈ ప్రమాదంలో శేకన్న, పెద్దనాగయ్య, మాల కిష్టప్ప, దాసరి తిక్కయ్య, ఉశేనీ పీరాలకు చెందిన 9 గడ్డివాములు అగ్ని ప్రమాదం కాలిపోయాయి.