ఆలూరు మండలం హులేబీడు గ్రామానికి చెందిన రైతు బాబయ్య (63) అప్పుల భారం తాళలేక పురుగుమందు తాగి మంగళవారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. బాబయ్యకు సొంతగా 7 ఎకరాల భూమి ఉంది. గతేడాది ఆయన మిరప పంట సాగు చేశారు. పంట సాగు కోసం సుమారు రూ. 6 లక్షల మేర అప్పు చేసినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. అయితే మార్కెట్‌లో మిరపకు గిట్టుబాటు ధర లేకపోవడంతో తీవ్రనష్టం ఎదురై, అప్పులు తీర్చే మార్గం లేక ఆత్మహత్య చేసుకున్నాడు.