ఆలూరు నియోజకవర్గంలోని చిప్పగిరి మండలం రాయదుర్గం గ్రామంలో ఆదివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికుల సమాచారం మేరకు అగ్నిప్రమాదంలో 15 గడ్డివాములు దగ్ధమయ్యాయి. రూ. 8 లక్షల మేర ఆస్తినష్టం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే చేరుకొని మంటలను అదుపు చేశారు. కాగా ప్రమాదంలో నష్టపోయిన రైతులు ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని కోరారు.