సర్పంచ్‌లకు నిధులే గ్రామ అభివృద్ధికి ఆధారమని ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి అన్నారు. శనివారం ఆలూరు ఆర్అండ్‌బీ గెస్ట్ హౌస్‌లో ఎమ్మెల్యే మాట్లాడుతూ 18 నెలలుగా జడ్పీటీసీ, ఎంపీపీ, సర్పంచ్‌లు, ఎంపీటీసీలకు వేతనాలు ఇవ్వలేదని, వాటిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 15వ ఫైనాన్స్ నిధులపై కూటమి ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలన్నారు. గ్రామాభివృద్ధి కోసం నిధులు అత్యవసరమని పేర్కొన్నారు.