ఆలూరు స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఈనెల 3వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ రమాదేవి గురువారం ప్రకటనలో తెలిపారు. జిల్లా వృత్తి నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి ఆనందరాజ్ కుమార్ ఆధ్వర్యంలో ఎస్బీఐ ఇన్సూరెన్స్, బీఎంఎస్ సెక్యూరిటీస్ కంపెనీలకు చెందిన వ అధికారులు హాజరుకాన్నుట్లు పేర్కొన్నారు. ధృవీకరణ పత్రాలతో నిరుద్యోగులు హాజరు కావాలని సూచించారు.