చిప్పగిరి మండలంలోని నేమకల్లు గ్రామ పశువైద్య అధికారిగా కమలమ్మ మంగళవారం బాధ్యతలు చేపట్టారు. గతంలో ఇక్కడ పనిచేసిన మహేష్ ఇతర విధుల బాధ్యతల కారణంగా వెళ్లడంతో ఆమె ఈ విధుల్లో చేరారు. ఆమె మాట్లాడుతూ రైతులకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కరిస్తామన్నారు. పశువులకు వచ్చే రోగాలకు వెంటనే టీకాలు వేయించుకోలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో పశు వైద్యశాలకు వచ్చినా వైద్యం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.