ఆలూరు: రైతుల ఆత్మహత్యలకు కుటమి ప్రభుత్వమే కారణం: విరూపాక్షి

79చూసినవారు
రైతుల ఆత్మహత్యలకు కుటమి ప్రభుత్వమే కారణమని ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి విమర్శించారు. మంగళవారం హులేబీడులో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ వైఫల్యాలే రైతుల బతుకుల్ని బూడిద చేస్తోందన్నారు. ఏడాది గడిచినా ఒక్క హామీని అమలు చేయలేదని, గిట్టుబాటు ధర లేక మిరప రైతులు అప్పుల్లో కూరుకుపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలూరులో మిరప పంట సాగు చేస్తే, కొనే దిక్కులేక రైతులు అప్పులపాలయ్యారన్నారు.

సంబంధిత పోస్ట్