ఆలూరు మండలం కురవల్లిలో శుక్రవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం. లారీ బైక్‌ను ఢీకొట్టడంతో బైక్ పై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.