హొళగుంద మండలం గజహాళ్లి గ్రామంలో శ్రీపోతులింగేశ్వర స్వామి రథోత్సవం సందర్భంగా ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి ప్రత్యేక పూజలు చేశారు. శనివారం గజహాళ్ళి గ్రామంలో ఎమ్మెల్యే పర్యటించారు. గ్రామంలోని వాల్మీకి మహర్షి విగ్రహం స్టీల్ కు ప్రారంభించారు. స్వామి వారిని దర్శించుకుని, పూజారుల నుంచి తీర్థ ప్రసాదం స్వీకరించారు. అనంతరం గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.