దేవనకొండ మండలంలో విద్యారంగ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ మండల అధ్యక్ష, కార్యదర్శులు మధు, భాస్కర్ కోరారు. శనివారం దేవనకొండకు వచ్చిన ఎంపీ పంచలింగాల బస్తిపాటి నాగరాజును ఏఐఎస్ఎఫ్ ప్రతినిధి బృందం కలిసి విద్యారంగ సమస్యలపై వినతిపత్రం అందజేశారు. దేవనకొండలో హాస్టల్ వసతి లేక విద్యార్థులు సుదూర ప్రాంతాలకు వెళ్లి చదువుకోవాల్సి వస్తోందన్నారు. దేవనకొండలో మోడల్ స్కూల్ ఏర్పాటు చేయాలన్నారు.