చిప్పగిరి మండలంలోని అన్ని సచివాలయాల పరిధిలోని ఇంటింటి సర్వేలను వేగంగా పూర్తి చేయాలని చిప్పగిరి ఎంపీడీవో అల్లాబకష్ పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. శుక్రవారం చిప్పగిరి ఎంపీడీవో కార్యాలయంలో సచివాలయాల సిబ్బందితో సమావేశం నిర్వహించి, మాట్లాడారు. కొన్ని సచివాలయాల సిబ్బంది వెనుకబడినందుకు అలసత్వం వీడి త్వరగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈనెల 15 లోపు చెత్త సంపద కేంద్రాలు అందుబాటులోకి రావాలని చెప్పారు.