ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ మంగళవారం హోళగుంద తహసీల్దారు కార్యాలయాన్ని తనిఖీ చేశారు. కార్యాలయంలో పనులు ఆలస్యంగా జరుగుతున్నట్లు తెలిసిన ఆయన సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం జరుగుతున్న రీసర్వే పనులను పరిశీలించి, సమ్మతగేరి వద్ద ఉన్న ఎల్లార్తి మంచినీటి పథకాన్ని కూడా పరిశీలించారు. వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.