ఆలూరు నియోజకవర్గంలోని దేవనకొండ మండలం బంటుపల్లి గ్రామంలో శనివారం హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గ్రామంలో జరిగిన రథోత్సవం, జిల్లాస్థాయి మహిళల కబడ్డీ పోటీలకు మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ ముఖ్య అతిథిగా హాజరై, కార్యక్రమాలను ప్రారంభించారు. స్థానిక టీడీపీ నాయకులు, యువత, గ్రామస్తులు భారీ సంఖ్యలో పాల్గొని వేడుకను విజయవంతం చేశారు.