దేవనకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకాన్ని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు ప్రారంభించారు. శనివారం ఆయన ఆలూరు జనసేన ఇంచార్జి వెంకప్పతో కలిసి విద్యార్థులతో పాటు భోజనం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థుల డ్రాప్ అవుట్స్ నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం తీసుకురావడం విశేషమని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక రాజకీయ నాయకులు కూడా పాల్గొన్నారు.