దేవనకొండ: మండల కేంద్రంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. శుక్రవారం గొర్రెల కాపరి తలారి లక్ష్మన్న (41) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతను రెండు నెలలుగా తీవ్ర కడుపునొప్పితో బాధపడుతుండేవాడని, రూ. 5 లక్షల అప్పు భారంతో ఉందని మృతుడి భార్య లక్ష్మి ఫిర్యాదు చేసింది. అనారోగ్యం, అప్పుల ఒత్తిడి తాళలేక బైరవకుంట గ్రామ సమీపంలో వేపచెట్టుకు ఉరి వేసుకున్నాడు. కేసీ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వంశీనాథ్ తెలిపారు.