ఆలూరు: విషాదం.. ట్రాక్టర్‌ తిరగబడడంతో యువకుడు మృతి

57చూసినవారు
ఆలూరు: విషాదం.. ట్రాక్టర్‌ తిరగబడడంతో యువకుడు మృతి
దేవనకొండ మండలం కప్పట్రాళ్లలో శనివారం ట్రాక్టర్‌ తిరగబడడంతో డ్రైవర్‌ జగదీష్‌ (23) మృతి చెందాడు. బోదెపాడకు చెందిన హనుమంతు, రంగులమ్మ దంపతుల కుమారుడు జగదీష్‌ ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పని చేసేవాడు. మేనమామ కోతి లక్ష్మన్న పొలంలో ఉల్లి పంట కోత తర్వాత లారీలో పంటను లోడ్‌ చేస్తుండగా, మలుపు తీసే క్రమంలో ట్రాక్టర్‌ తిరగబడి ఇంజన్‌ అతని మీద పడింది. జగదీష్‌కు భార్య, ఏడాది కుమారుడు ఉన్నారు.

సంబంధిత పోస్ట్