ఆలూరు: ఆర్వో ప్లాంట్ నిధుల కొరతతో పనులు నిలిపివేత

85చూసినవారు
ఆలూరు: ఆర్వో ప్లాంట్ నిధుల కొరతతో పనులు నిలిపివేత
చిప్పగిరి మండలం బంటనహళ్ గ్రామంలో గ్రామ యువత, సర్పంచ్ ఆధ్వర్యంలో గత ఏడాది ఆర్వో ప్లాంట్ కోసం భూమిపూజ జరిగింది. గ్రామస్థుల సహకారంతో పనులు ప్రారంభమైనప్పటికీ, ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో పనులు నిలిచిపోయాయి. ప్రస్తుతం వ్యవసాయ పనులు ప్రారంభమయ్యాయి. కావున మంచినీటి అవసరం ఎక్కువైంది. అధికారులు నిధులు మంజూరు చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్