ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిపై ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు నియోజకవర్గం వైసీపీ నాయకులు పాండు తెలిపారు. శుక్రవారం ఆయన చిప్పగిరిలో మాట్లాడారు. ఆలూరు నియోజకవర్గంలోని సమస్యలపై కర్నూలు డీఆర్సీ సమావేశంలో మాట్లాడుతున్న సమయంలో పార్థసారథి కలగజేసుకోని ఎమ్మెల్యే విరుపాక్షిపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని వారు తప్పు పట్టారు. కుటమి ఎమ్మెల్యే పార్థసారథి చేసిన వ్యాఖ్యలు బాధాకరమన్నారు.