ఆలూరు వద్ద ఆటో-బైక్ ఢీ: ఇద్దరికి తీవ్ర గాయాలు

1చూసినవారు
ఆలూరు వద్ద ఆటో-బైక్ ఢీ: ఇద్దరికి తీవ్ర గాయాలు
ఆలూరు సమీపంలోని హైవే 167 పై ఆటో, బైక్‌ ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం ఈ ప్రమాదంలో బళ్లారి నుంచి పీర్ల పండుగకు వస్తున్న నవీన్ డ్రైవ్ చేసిన ఆటో, అగ్రహారంకు చెందిన వీరేష్ బైక్‌పై వస్తూ ఢీకొన్నారు. ఘటనలో వీరేష్, నవీన్‌కు తీవ్రగాయాలు కాగా, ఆటోలో ఉన్న శేఖర్ కు చెయ్యి విరిగింది. క్షతగాత్రులను ఆలూరు, బళ్లారి, ఆదోని ఆసుపత్రులకు తరలించారు.

సంబంధిత పోస్ట్