ఆస్పరి మండలం కారుమంచి గ్రామంలో ట్రాక్టర్ కింద పడి 12ఏళ్ల దొరబాబు మృతి చెందాడు. సోమవారం వ్యవసాయ పనుల్లో తల్లికి తోడుగా ఉన్న బాలుడు, చిన్నన్న వెంకటేష్ ట్రాక్టర్ తో గరుసు వేసిన తర్వాత ట్రాక్టర్ అదుపు తప్పి ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో బాలుడు మృతి చెందాడు. తల్లి ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై మన్మద విజయ్ తెలిపారు. కుటుంబ సభ్యులు, బంధువుల కన్నీరుమున్నీరుగా విలపించారు.