చిప్పగిరి మండలంలోని నేమకల్లు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు బదిలీపై వచ్చిన పి. ఏకాంబరంను ఆ పాఠశాల ఉపాధ్యాయులతో పాటు గ్రామ పెద్దలు, వంట ఏజెన్సీ శుక్రవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులతో పాటు తాను కూడా విద్యార్థుల విద్యాభివృద్ధికి అలుపెరుగని కృషి చేస్తానని తెలిపారు. విద్యార్థుల సేవకు పునరంకితులమవుదామని ఆయన ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు.