దేవనకొండ: నకిలీ బంగారం మోసం.. నలుగురు అరెస్ట్

53చూసినవారు
దేవనకొండ: నకిలీ బంగారం మోసం.. నలుగురు అరెస్ట్
దేవనకొండ మండలంలో తక్కువ ధరకు బంగారం విక్రయిస్తామని నమ్మబలికి, నకిలీ బంగారం చూపి రూ. 1.2 లక్షలు మోసం చేసిన నలుగురిని సీఐ వంశీనాథ్ అరెస్టు చేశారు. సోమవారం మండలంలోని గుండ్లకొండకు చెందిన రంగస్వామిని మోసగించిన నిందితులను 24 గంటల్లో పట్టుకున్నట్లు సీఐ వంశీనాథ్ తెలిపారు. నిందితులను న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. ప్రజలు అపరిచితుల మాటలు నమ్మవద్దని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్