దేవనకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కేటాయించిన ప్రభుత్వ అంబులెన్స్ నిర్వహణ లేక మూలనపడి తుప్పుపట్టింది. లక్షల రూపాయలు ఖర్చు చేసిన ఈ వాహనం ఎండలకు ఎండుతూ, వానలకు తడిసి పనికిరాని స్థితికి చేరింది. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని, వెంటనే అంబులెన్స్ కు మరమ్మతులు చేసి ఉపయోగంలోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు.