ఆస్పరి: విద్యుత్ ప్రమాదం.. ఇద్దరికి తీవ్ర గాయాలు

70చూసినవారు
ఆస్పరి: విద్యుత్ ప్రమాదం.. ఇద్దరికి తీవ్ర గాయాలు
ఆస్పరి మండలం చిన్నహోతూరు గ్రామంలో ట్రాన్స్ఫార్మర్‌లో మంటలు చెలరేగడంతో, శుక్రవారం మల్లికార్జున, పరశప్ప అనే ఇద్దరు వ్యక్తులు వాటిని ఆర్పేందుకు ప్రయత్నించగా విద్యుత్ షాక్‌కు గురై గాయపడ్డారు. గ్రామస్తుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న ఔట్ పోస్టు కానిస్టేబుల్ వివరాలను వెల్లడించారు. వెంటనే బాధితులను ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారి పరిస్థితి స్థిరంగా ఉన్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్