కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఆలూరు టీడీపీ ఇన్‌చార్జి వీరభద్ర గౌడ్ గురువారం బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రాన్ని వైసీపీ ప్రభుత్వం నుంచి విముక్తం చేసిన ప్రజలందరూ ఇప్పుడు ఆనందంగా ఉన్నారని అన్నారు. ఎన్డీయేలో టీడీపీ కీలక భాగస్వామిగా ఉండటంతో కేంద్రం రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తోందన్నారు.