హాలహర్వి మండలంలోని నిట్రవట్టిలో రెండురోజులుగా కురుస్తున్న వర్షాలతో పెద్దవంక ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఈ గ్రామానికి చెందిన రైతు తేజప్ప (44)కు గురువారం గుండెనొప్పి వచ్చింది. 108కు సమాచారం ఇచ్చినా వంక ఉధృతి వల్ల వాహనం ఇంటివరకు రాలేకపోయింది. ఈ నేపథ్యంలో ఎద్దుల బండిపై తేజప్పను తరలించినా, ఆసుపత్రికి చేరేలోపే మృతి చెందారు.