ఆలూరు మండలం చింతకుంట గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది.గ్రామానికి చెందిన 17 ఏళ్ల అశోక్, ఇంటి పై నుంచి కిందికి దిగుతూ ప్రమాదవశాత్తు విద్యుత్తు తీగలకు తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబ సభ్యులు అతనిని వెంటనే బళ్లారి ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ అశోక్ మృతి చెందాడు. విద్యుత్తు అధికారులు ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపడుతున్నారు, ఈ ఘటన పై కేసు నమోదు చేశారు.