ఉమ్మడి కర్నూలు, నంద్యాల వ్యవసాయ మార్కెట్ యార్డులో డీసీఎంఎస్ చైర్మన్‌గా వై. నాగేశ్వరరావు యాదవ్ ఆదివారం పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఆలూరు తాలూకా టీడీపీ ఇంచార్జి బి. వీరభద్రగౌడ్ హాజరై శుభాకాంక్షలు తెలిపారు. మంత్రులు బీసీ జనార్ధన్ రెడ్డి, ఎన్ఎండీ ఫరూక్, డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు, జిల్లా నాయకులు భారీగా పాల్గొన్నారు.