కర్నూలు ఎన్.ఆర్.పేటలోని భాష్యం ఇంగ్లీష్ స్కూల్లో నర్సరీ విద్యార్థుల క్రీడా పోటీలను నిర్వహించడం అభినందనీయమని జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు రామాంజనేయులు తెలిపారు. కిడ్స్ కార్నివాల్ కార్యక్రమంలో ఒలింపిక్ తరహాలో వేడుకలు నిర్వహించడం ద్వారా చిన్నారుల్లో క్రీడలపై ఆసక్తి పెరుగుతుందని అన్నారు.పాఠశాలలో ఉన్న పాటి స్థలంలో క్రీడా పోటీలను నిర్వహించి బహుమతులు అందజేశారు.